ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు అందరినీ ఆలోచనలో పడవేస్తున్నాయి. ఇవన్నీ మళ్లీ అధికారంలోకి రావడానికి జగన్ అమలు చేస్తున్న వ్యూహాలే అని అర్థమవుతోంది. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించని వ్యూహాలను జగన్ అనుసరిస్తున్నారని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రెండేళ్ల క్రితం ఎఫ్ఐఆర్ అయిన కేసులో, ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయించడం అంటే అది సాహసేవపేతమైన నిర్ణయం అని రాజకీయ వర్గాలు అంటున్నారు.
టిడిపి అధినాయకుడిని అరెస్టు చేస్తే సానుభూతితో టీడీపీకి ఓట్లు పడతాయని సామాన్యులకు సైతం అర్థమవుతుంది. కానీ జగన్ వ్యూహం ఏంటనేది అందరినీ ఆలోచనలో పడ వేస్తోంది. పార్టీ అధినేత జైలులో ఉంటే అధినేత జైలులో ఉన్న ఒక్కొక్క రోజుకు బయట ఉన్న కార్యకర్తలలో ధైర్యం సన్నగిల్లుతుంది, బయటకు కనిపించని భయం పెరుగుతోంది. అలా కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసి ఎన్నికల ప్రణాళికను ఆపగలిగారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా గత ఎన్నికలలో కూడా టిడిపికి రావలసిన డబ్బును అందకుండా చేసి ఎన్నికలలో టిడిపి ఓటమికి వైసీపీ కారణమయ్యారని ఆరోపణలు కూడా వినిపించాయి. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అనుసరించి టిడిపిని అష్టదిగ్బంధనంలో ఉంచి విజయాన్ని సాధించాలని వైసీపీ ఆలోచిస్తోంది.
టిడిపికి ఎన్నికల్లో ప్రచారానికి గాని, అభ్యర్థులు ఖర్చు పెట్టడానికి గాని కావలసిన ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలని జగన్ ఆలోచిస్తున్నారని అంచనా. టిడిపి బ్యాంక్ అకౌంట్ లపై సిబిఐ నిఘా ఉంది. టిడిపికి డబ్బును సమకూర్చే నారాయణ లాంటి ఒక పదిమంది పెద్ద నాయకుల బ్యాంక్ అకౌంట్లో పైన కూడా సిబిఐ నిఘా ఉంది. గతంలో ఎన్ఆర్ఐలు కూడా ఫండ్ ఇచ్చేవారు కానీ, ఇప్పుడు ఎన్నారై ఖాతాలపై కూడా సిబిఐ నిఘా నేత్రాన్ని ఉంచారని తెలుస్తోంది. జగన్ కు బిజెపితో ఉన్న సానిహిత్యం వల్ల రాష్ట్రంలోని పరిస్థితులన్నింటినీ జగన్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జగన్ అష్టదిగ్బంధనం నుంచి టిడిపి విడిపించుకుంటుందా???? అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతతో టిడిపి విజయం సాధించగలదా?? వేచి చూడాల్సిందే..