చంద్రబాబు అరెస్ట్ అయ్యిన తర్వాత రాష్ట్రంలో రాజకీయంగా చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు పై ప్రజల్లో సానుభూతి వర్క్ అవుట్ అవుతుందని రాబోయే ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయి అధికారం టీడీపీ వశం అవుతుందని కలలు కంటున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ కూడా చంద్రబాబు కేసు మీదనే ఆధారపడి ఉన్నాయన్నది సత్యం. ఈ కేసులో చంద్రబాబు తప్పు చేయకపోతే సానుభూతి నిజమే, ఒకవేళ తప్పని తేలితే ఇక రాజకీయ కెరీర్ ఖతం అని చెప్పాలి. ఇదిలా ఉంటే సుప్రీమ్ కోర్ట్ లో క్వాష్ పిటిషన్ పై విచారణ మొదలెట్టిన ధర్మాసనం, కొంత సమయం తర్వాత మళ్ళీ విచారణను రేపటికి వాయిదా వేసింది.
కేవలం ఈ రోజు చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే వాదనలు మాత్రమే వినగా రేపు విచారణలో భాగంగా ప్రభుత్వం తరపున మరియు సిఐడి తరపున లాయర్లు వాదనలు విననుంది. మరి ఇందులో ఏమి తీర్పును వెలువడించనుంది అన్నది తెలియాల్సి ఉంది.