మహిళా రిజర్వేషన్‌లో ఓబీసీ కోటా అమలు పరుస్తాం : రాహుల్‌

-

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గణనతో పాటు మహిళా రిజర్వేషన్‌లో ఓబీసీ కోటా అమలు పరుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్‌లో కులగణనపై ఏకగ్రీవం ఆమోదంతో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్నాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ సీఎంల నుంచి కూడా కులగణనకు మద్దతు ఉందని చెప్పారు. కులగణనను దేశం మొత్తం కొరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం కులగణన చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. కులగణన అనేది కులం, మతానికి సంబంధించిన విషయం కాదని పేదరికానికి సంబంధించిన విషయం అన్నారు. కులగణన లేకుండా సంక్షేమ పథకాల అమలు చేయడం అంటే ఎక్స్ రే తీయకుండా రోగికి వైద్యం చేయడం లాంటిదని సెటైర్ వేశారు.

Womens Reservation Bill Rahul Gandhi: "100% Regret...": Rahul Gandhi On  Congress' Failure To Include OBCs In Women's Bill

మ‌రోవైపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కుల గ‌ణ‌న స‌ర్వేలు నిర్వ‌హిస్తార‌ని పేర్కొన్నారు. సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా ప‌లువురు స‌భ్యులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో కుల గ‌ణ‌న‌తో పాటు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు స‌హా ప‌లు అంశాల‌పై సంప్ర‌దింపులు జ‌రిపారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యానికి అవ‌స‌ర‌మైన వ్యూహాల‌పై చ‌ర్చించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ కుల గ‌ణ‌న‌కు అనుకూలంగా ఉంద‌ని, రాజ‌స్ధాన్‌లో ఈ దిశ‌గా ప్ర‌క్రియ మొద‌లైంద‌ని కాంగ్రెస్ నేత భ‌న్వ‌ర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇక సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో రాజ‌స్ధాన్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, క‌ర్నాట‌క‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల సీఎంల‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల సీఎల్పీ నేత‌లు పాల్గొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news