వరల్డ్ కప్ 2023 లో అక్టోబర్ 5వ తేదీ నుండి మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇక ఇండియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మనమే కప్ ను సాధించడంలో ఫేవరెట్ గా ఉన్నామని నిస్సందేహంగా చెప్పవచ్చు. కాగా ఇప్పటి వరకు ఇండియా ఆడిన ఏకైక మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించి పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది. రేపు ఇండియా ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఆఫ్గనిస్తాన్ తో ఆడనుంది. రోహిత్ శర్మ సారథ్యంలో ఇండియా అన్ని విభాగాలలో పటిష్టంగా ఉన్నప్పటికీ వరుసగా రెండు మూడు వికెట్లు పడితే పరిస్థితి ఏమిటి అన్నది మొన్న జరిగిన మ్యాచ్ లో తేటతెల్లం అయింది. ఒకవేళ కోహ్లీ రాహుల్ ఆడకుంటే ఏమయ్యేది అన్నది ఇప్పటికీ ప్రశ్నర్ధకంగా ఉంది. అందుకే ఈ మెగా టోర్నీలో ఏ జట్టునూ కూడా తక్కువ అంచనా వేయకూడదు.
ఆఫ్ఘనిస్తాన్ లో ప్రపంచ ప్రఖ్యాత బౌలర్లు మరియు బ్యాట్స్మన్ ఉన్నారు. ముఖ్యంగా తమదైన రోజున మ్యాచ్ ను శాసించగలిగే స్థాయిలో గర్భాజ్, రశీద్ ఖాన్, నబి మరియు జాడ్రాన్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు.