ఈ సంవత్సరం తెలంగాణకు చెందిన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పి వి సింధుకు అస్సలు కలిసి రావడం లేదని మరోసారి రుజువయింది. ఈ సంవత్సరం జరిగిన టోర్నీలలో ఒక్కటి కూడా గెలవలేకపోవడం నిజంగా ఆమె దురదృష్టకరం అని చెప్పాలి. కాగా ఇటీవల చైనాలో ముగిసిన ఆసియన్ గేమ్స్ లోనూ మొదటి రౌండ్ లోనే ఓటమి పాలయ్యి విమర్శలను మూటకట్టుకుంది. ఈ టోర్నీ తర్వాత ఆర్కిటిక్ ఓపెన్ లో ఆడుతున్న సింధు ఎట్టకేలకు సెమీస్ వరకు చేరుకొని టైటిల్ ను చేజిక్కించుకునేలా కనిపించినా దురదృష్టం మాత్రం తనను వెంటాడింది. సింధు సెమీస్ లో చైనాకు చెందిన వాంగ్ జి యి చేతిలో 12 – 21 , 21 – 11 , 7 – 21 తేడాతో ఓటమి చెంది టోర్నీ నుండి నిష్క్రమించింది.
ఈ సీజన్ లో ఇండియా సెమీఫైనల్ లో ఓడిపోవడం ఇది నాలుగవ సారి అని తెలుస్తోంది. మరి సింధు ఇంకెప్పుడు ఫామ్ లోకి వచ్చి అభిమానులను ఆకట్టుకునే ప్రదర్శన చేస్తుందో చూడాలి.