ప్చ్… తృటిలో సెంచరీ ని కోల్పోయిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ !

-

ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్యం ఇవాళ జరుగుతున్న వన్ డే లో ఇండియా విజయం దిశగా దూకుసుకువెళుతోంది. పాకిస్తాన్ ఇచ్చిన స్వల్ప లక్ష్యం 192 పరుగులను చేధించే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులో పాతుకుపోయి మిషన్ ను కంప్లీట్ చేసే పనిలో చాలా బిజీ గా ఉన్నాడు. ఆరంభం నుండి చాలా ధాటిగా ఆడుతూ వచ్చిన రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో వరుసగా రెండవ అర్ద సెంచరీ ని పూర్తి చేసుకున్నాడు. అయితే మరో పరుగులు చేసి ఉంటే వరల్డ్ కప్ లో వరుసగా రెండు సెంచరీ లు చేసేవాడు. కానీ జట్టును ముందుగా విజయం దక్కేలా చేసి తద్వారా నెట్ రన్ రేట్ ను అధికంగా పొందాలన్నది రోహిత్ శర్మ ప్లాన్.. ఆ ప్లాం లో భాగంగా తొందరగా మ్యాచ్ ను ముగించాలని షహీన్ ఆఫ్రిది బౌలింగ్ లో ఇఫ్తికర్ అహమద్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

రోహిత్ అవుట్ అయ్యే సమయానికి జట్టు స్కోర్ 157 కాగా , అతని స్కోర్ 86 పరుగులు.. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 6 ఫోర్లు మరియు 6 సిక్సులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news