షాక్ లో ఫ్యాన్స్: గర్జించని “లియో”… విజయ్ కెరీర్ లో మరో ప్లాప్ !

-

తమిళ స్టార్ హీరో విజయ్ మరియు ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ లను అందించిన లోకేష్ కనగరాజ్ మరో మోస్ట్ అవైటెడ్ ఫిలిం లియో తో ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈమధ్యనే ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇక సినిమా ఇప్పటికే చాలా చోట్ల ఫ్యాన్సీ షో పూర్తి అయింది. ఒక్కొక్కరుగా ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తమిళ క్రిటిక్ మనోభాల విజయబాలన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ… సింహం లాగా గర్జించాలనుకున్న డైరెక్టర్ లోకేష్ చివరికి పిల్లిగా మారిపోయాడు అంటూ సింగిల్ డైలాగ్ లో చెప్పేశాడు. లోకేష్ కంగరాజ్ కెరీర్ లో ఇది చాలా దారుణమైన సినిమాగా అభివర్ణించారు మనోబాల. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను అందుకోవడంలో లియో అండ్ టీం సమిష్టిగా ఫెయిల్ అయిందన్నారు. సినిమాలో విజయ్ నటన మరియు కొన్ని యాక్షన్ సిక్వెన్సెస్ మినహా చెప్పుకోవడానికి ఏమీ లేదట.

సీనియర్ నటులు సంజయ దత్, అర్జున్ లను సరిగా వాడుకోలేదని… వాళ్ళ స్టామినాకు తగిన నటనను రప్పించుకోవడంలో లోకేష్ ఫెయిల్ అయ్యాడట. ఓవరాల్ గా విజయ్ కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ వీక్ మూవీ గా లియో ను చెప్పుకోవచ్చు అంటూ మనోభాల ట్విట్టర్ లో చెప్పారు. ఈ రివ్యూ ను చూసి విజయ్ ఫాన్స్ షాక్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news