నందమూరి కళ్యాణ్ రామ్ ‘NKR21’ మూవీ స్టార్ట్

-

టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుంటాడు కళ్యాణ్ రామ్. యువ దర్శకులు, వైవిధ్యమైన కథలతో ఆయన చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఇదివరకే కళ్యాణ్ రామ్, ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన 21వ చిత్రానికి సైన్ చేశాడు. “అలా ఎలా” అనే ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీని నిర్మించిన తర్వాత అశోక క్రియేషన్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ ని టేకప్ చేస్తోంది. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇంతకు ముందే ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న NKR21 సినిమా పూజా కార్యక్రమంలో మొదలైంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ నటించనున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తాజాగా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్టర్ లో పంచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news