WORLD CUP 2023: శ్రీలంకతో విజయం కోసం పోరాడుతున్న నెదర్లాండ్…!

-

ఈ రోజు వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి, అందులో భాగంగా ఉదయం నుండి జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక మరియయు నెదర్లాండ్ లు పోరాడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్ మరోసారి మాయచేసింది. గత మ్యాచ్ లో లాగే ఈసారి కూడా టాప్ ఆర్డర్ చేతులెత్తేయడంతో లోయర్ ఆర్డర్ అద్భుతంగా ఆడి శ్రీలంక ముందు ఒక మాదిరి లక్ష్యాన్ని 263 ఉంచింది. ఛేజింగ్ లో శ్రీలంక మొదట్లో తడబడి వికెట్ కోల్పోయినా ఆ తర్వాత స్ట్రాంగ్ గా నిలబడి ఆడుతూ ఉంది. అయినప్పటికీ నెదర్లాండ్ విజయం కోసం చాలా తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయి విజయానికి దగ్గరగా వెళుతోంది.

క్రీజులో బబుల్ గమ్ లాగా సమరవిక్రమ మరియు అసలంకలు చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్ కు గెలిచే అవకాశాలు దాదాపుగా లేనట్లే. ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే నెదర్లాండ్ కు సెమీస్ చేరడానికి సమీకరణలతో కూడా పనిలేనట్లే.

Read more RELATED
Recommended to you

Latest news