ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ… జనసేన-బిజెపి రాజకీయంపై ఆసక్తి పెరుగుతుంది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బిజెపి ఒంటరిగా వెళ్తుందా లేక ఏదైనా పార్టీ తో కలిసి పోటీ చేస్తుందా అనేది చెప్పలేని పరిస్థితి. తాము టీడీపీ తో కలిసి వెళ్తామని ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. అటు తెలుగుదేశం పార్టీ సైతం దీనికి సంబంధించి అడుగులు వేస్తుంది. పార్టీ సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుంది. ఉమ్మడి పోరాటాలు చేసేందుకు సిద్దమవుతున్నాయి రెండు పార్టీలు.
ఇక పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆయన్ను ఇబ్బంది పెట్టాలని ఏపీ సిఎం జగన్ కూడా భావిస్తున్నారు. అందుకే పవన్ పై వ్యక్తిగత విమర్శలకు సైతం ఆయన వెనకడుగు వేయడం లేదు. ఇక బిజెపితో కలిసి వెళ్లేందుకు పవన్ అంతగా ఆసక్తి చూపడం లేదనే మాట వినపడుతుంది. బిజెపి నేతలు ఆయనతో చర్చించినా పవన్ మాత్రం ససేమీరా అంటున్నారని అంటున్నాయి రాజకీయ వర్గాలు. బిజెపితో కలిసి ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా పార్టీకి భవిష్యత్తు ఉండదు అని పవన్ భావిస్తున్నారు.
అటు చంద్రబాబు కూడా రాజకీయంగా అంత మంచిది కాదని గతంలో బిజేపిని టార్గెట్ చేసి ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళడం కరెక్ట్ కాదని ఆయన భావిస్తున్నట్టుగా టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ తరుణంలో బిజెపి అడుగులు ఎలా ఉంటాయి అనేది తెలియడం లేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా మార్చినా ఆ పార్టీకి పెద్దగా ఫలితం లేదనే చెప్పాలి. ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్క శాతం కూడా ఓట్లు వచ్చే అవకాశం లేదు. దీనితో ఇప్పుడు ఏం చెయ్యాలనే దానిపై పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో పరోక్షంగా బిజెపి కూడా విలన్ కావడంతో దిక్కు తోచని పరిస్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.