దేశ చరిత్రలోనే సామాజిక విప్లవం తెచ్చిన వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి మేరుగు నాగార్జున కొనియాడారు. సామాజిక సాధికార యాత్ర పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘చంద్రబాబు దళితుల్ని, బీసీలను అవమానించారు. పేదల స్థితిగతుల్ని మార్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ , ఏస్టి, బీసీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. చేసిన మంచిని ప్రజలకు వివరించేందుకే ఈ యాత్ర చేస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని చంద్రబాబు అహంకారం ప్రదర్శించాడని దుయ్యబట్టిన ఆయన.. మంత్రులు కూడా దళితులను చులకనగా చూశారని విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రజలు టీడీపీకి 23 స్థానాలకు పరిమితం చేసింది.
రాష్ట్రంలో దొంగలు తయారు అయ్యారు.. అందుకే ఈ సామాజిక సాధికార యాత్ర అన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గిందని చెప్పుకొచ్చారు.. ఈ విషయాలు ప్రజల దగ్గరకు తీసుకుని వెళతాం.. ఈ రాష్ట్రానికి జగన్ అవసరం అని వెల్లడించారు. మేం ప్రజల కోసం బస్సు యాత్ర చేస్తుంటే టీడీపీ జైల్లో ఉన్న వాడి కోసం బస్సు యాత్ర చేస్తోందని ఎద్దేవా చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు ఈ యాత్ర ద్వారా వివరిస్తాం అన్నారు. బ్యాక్ వార్డ్ క్లాస్ అంటే బాబు క్లాస్ అని చెప్పి ఈ వర్గాల ఓట్లు వాడుకున్నారు అని ఆరోపించారు మంత్రి మెరుగ.