మ‌హా ట్విస్ట్‌…. రాష్ట్ర‌ప‌తి పాల‌న‌కు గ‌వ‌ర్న‌ర్ సిఫార్సు

-

మహారాష్ట్రలో రోజురోజుకు రాజకీయం ఎటు వైపు మలుపు తిరుగుతుందో ? అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి . బిజెపి – శివసేన కూటమి విభేధించడంతో రాష్ట్రంలో రోజుకో ట్విస్ట్ తెర మీదకు వస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ తాజా ట్విస్ట్‌ల ప‌రంప‌ర‌లో ఇప్పుడు రాష్ట్ర‌ప‌తి పాల‌న‌తో ఇక్క‌డ హైడ్రామాకు తెర‌ప‌డ‌నుంది. గ‌డువు దాటిని ఇక్క‌డ ఎవ్వ‌రూ ప్ర‌భుత్వ ఏర్పాటుకు ముందుకు రాక‌పోవ‌డంతో చివ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోశిరియా రాష్ట్ర‌ప‌తి పాల‌న కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు.

ముందుగా బీజేపీని ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గ‌వ‌ర్న‌ర్ ఆ పార్టీ చేతులు ఎత్తేయ‌డంతో ఆ త‌ర్వాత శివ‌సేన‌కు అవ‌కాశం ఇచ్చారు. అయితే శివ‌సేన‌కు మ‌ద్ద‌తు ఇచ్చే విష‌యంలో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేదు. దీంతో గ‌వ‌ర్న‌ర్ పాల‌న పెట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నా ప్రభుత్వ ఏర్పాటుపై చ‌ర్చ‌లు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

మూడు పార్టీలకు కలిపి 160 మంది మద్దతు ఉంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఈ బ‌లం స‌రిపోతుంది. ఈ మూడు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సమయం ఇచ్చినప్పటికీ విఫలం కావడంతో… చివరగా రాష్ట్రపతి పాలనకు కేంద్రానికి మహారాష్ట్ర గవర్నర్ సిఫార్సు చేయ‌క త‌ప్ప‌లేదు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ పాల‌న పెడితే కొద్ది రోజుల త‌ర్వాత కూడా ఏ పార్టీలు క‌ల‌వ‌క ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌క‌పోతే ఆ త‌ర్వాత అయినా ఐదారు నెల‌ల్లో ఇక్క‌డ మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

Read more RELATED
Recommended to you

Latest news