కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల్లో లాజిక్ గా మాట్లాడుతున్నానని, కామెంట్లు చేస్తున్నానని అనుకుంటు న్న టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అడ్డంగా దొరికిపోతున్నారు. వాస్తవానికి లోకేష్ ఏమా ట్లాడి నా లైట్‌గా తీసుకుంటారు పార్టీ నాయకులు సహా ప్రజల్లోని ఓవర్గం. తాజాగా తెలుగు మాధ్యమాన్ని తీసి వేసి ప్రభుత్వ బడుల్లో ఖచ్చితంగా ఇంగ్లీష్‌ను ప్రవేశ పెడతామంటూ.. వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, దీనిపై ప్రతిపక్షాలు ఆదిలో లైట్ తీసుకున్నా.. ఇంతకన్నా జగన్‌ను ఇరికించేందుకు మరో అస్త్రం దొరక దని భావించారు.
ఆ వెంటనే ప్రబుత్వంపై తీవ్ర విమర్శలు ప్రారంభించారు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు. ఎవరికి వా రుగా విడివిడిగా దూకుడు ప్రదర్శించి, విమర్శలు సంధిస్తున్నా.. అందరిదీ కలిపి ఒకే అజెండాగా ఉన్న విషయం మాత్రం స్ఫష్టంగా తెలుస్తోంది. అయితే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. వ్యవహార శై లి ఆశ్చర్యానికి ఆవేదనకు గురి చేస్తోంది. సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన లోకేష్.. తొలుత చేసి న ట్వీట్ తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీంతో ఆయన దానిని వెంటనే డిలీట్ చేశారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. మీరు అప్పట్లో అడ్డుపడకపోతే.. మేమే ఇంగ్లీష్ మీడియం అమలు చేసేవాళ్లం!! అని!!
అయితే, దీనిపై తీవ్ర విమర్శలు రేగడంతో.. ఆ వెంటనే గతంలో చంద్రబాబు ప్రభుత్వం తెలుగు మీడి యం తెచ్చేందుకు ప్రయత్నించిందని, అయితే, జగన్ అండ్ కో అడ్డుపడ్డారని అందుకే వెనక్కి తగ్గామని లోకేష్ ఒప్పేసుకున్నారు. ఇప్పుడు కూడా గతంలో తాము విపక్షాలు చేసిన ఒత్తిడి తలొగ్గి వెనక్కితగ్గాం కాబట్టి.. ఇప్పుడు జగన్ కూడా అలానే వెనక్కి తీసుకోవాలనేది లోకేష్ భావన. అయితే, ఇలా ఒక నిర్ణయం తీసుకునే ముందు తీసుకోనా..వద్దా.. అంటూ కాలం గడిపేసి, ఎక్కడైనా ఎవరైనా వ్యతిరేకిస్తారేమో.. అని భయపడి పాలించే వాడైతే.. జగన్ ఎలా అవుతాడు? ఇది వైసీపీ పాలన ఎలా అవుతుంది? అని అంటున్నారు విశ్లేషకులు.
ఈ క్రమంలోనే మీరైతే.. సర్దుకున్నా. జగన్ ఎలా సర్దుకుపోతాడు చిన్నబాబూ.. అఖండ మెజారిటీ ఇచ్చింది.. ఇందుకేనా? అని ప్రశ్నిస్తున్నారు. పైగా ప్రజల్లో ఎక్కడైనా వ్యతిరేకత వచ్చిందా? ఇంగ్లీష్ మీడియం కొసమే కదా.. ప్రజలు ఇప్పుడు కలలు కంటున్నారు. వారి పిల్లలను చదివించేందుకు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు? ఇవన్నీ తెలిసి.. కూడా జగన్ చేస్తున్న ప్రయత్నాన్ని హర్షించి, తెలుగుకు భంగం కాని విధంగా సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన లోకేష్ ఇలా వ్యవహరించడంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.