కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో హీరో నితిన్ మామ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో లాబీయింగ్ లకు తలోగ్గి టికెట్లు ఇచ్చారని నిజామాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డ టాలీవుడ్ హీరో నితిన్ మేనమామ నగేష్ రెడ్డి ఆరోపించారు. ‘మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న మమ్మల్ని గుర్తించలేదు.
బయటకు వెళ్ళిపోదాం అనుకున్న వారికి టికెట్లు ఇచ్చారు. నాకోసం హీరో నితిన్ కూడా ప్రయత్నించారు. ప్రచారం కూడా చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ లోనే ఉంటా’ అని వెల్లడించారు కాగా… భూపతిరెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా..రెండో విడత విజయ భేరి బస్సు యాత్ర ఇవాళ్టి నుంచి షురూ కానుంది. తాండూరులో ఇవాళ ప్రారంభం కానున్న ఈ యాత్రలో.. కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొననున్నారు. ఆరు రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఒక రోజులో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ యాత్రలో భాగంగా మొత్తం 17 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది.