జగన్‌ రెడ్డి వర్సెస్‌ పవన్‌ నాయుడు…

-

ప‌వ‌న్ క‌ల్యాణ్ ముగ్గురు భార్య‌ల పిల్ల‌లు ఏ స్కూల్ లో చ‌దువుతున్నార‌న్న ఏపీ సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ స్పందించారు. తాను జ‌గ‌న్ మాదిరిగా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగ‌న‌ని, అయినా జ‌గ‌న్ వైసీపీ నేత‌గా మాట్లాడుతున్నార‌ని, ఆయ‌న ముఖ్య‌మంత్రి అనే సంగ‌తి మ‌రిచిపోయిన‌ట్టున్నార‌ని ప‌వ‌న్ అన్నారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

‘జనసేన కుల రాజకీయాలు చేయదు.. వ్యక్తిగత విమర్శలు నేను చేయను.. అని అంటూనే పవన్  వైఎస్ జ‌గ‌న్ పై పూర్తిగా వ్యక్తిగత విమర్శలే చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉండివచ్చారంటూ పవన్ ధ్వ జ మెత్తారు. జగన్ తో పాటు విజయసాయి రెడ్డి కూడా జైల్లో ఉండివచ్చారంటూ విమర్శించారు.
‘పాలన చేతకాక.. కాపు నేతలతో తిట్టిస్తారా.? ముందు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప రిష్కరించండి.. ఆ తర్వాత నా మీద ఫోకస్‌ పెట్టండి.. నాకేమీ సమస్య లేదు’ అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, సూ టిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు.

అయితే పవన్‌ ఊహించినట్లే.. వైసీపీ తరఫున, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తరఫున ఆ పార్టీకి చెందిన కాపు నేత, మంత్రి పేర్ని నాని మీడియా ముందుకొచ్చి, పవన్‌ కళ్యాణ్‌పై ఎడా పెడా విమర్శలు చే సేశారు. ‘పవన్‌ నాయుడు’ అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని వైఎస్‌ జగన్‌ అనీ, జగన్‌ అనీ, జగన్‌ రెడ్డి అనీ అనడం కొత్తేమీ కాదు. అయితే పవన్‌ కళ్యాణ్‌ ‘జగన్‌ రెడ్డి’ అని సంబోధించ‌డంపై వైసీసీ నేత‌లు సీరియ‌స్ తీసుకున్న‌ట్లు వారి వ్యాఖ్య‌లను బ‌ట్టి తెలుస్తోంది.

నిజానికి, పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడూ తన పేరు చివర్న ‘నాయుడు’ అని పెట్టుకోలేదు. దీంతో ‘పవన్ నా యుడు’ అనడానికి మాత్రం పేర్ని నాని చాలా కష్టపడాల్సి వచ్చింది. పవన్‌ ప్రెస్‌మీట్ ముగిసిన వెంట‌నే, పేర్ని నాని  అలా మీడియా ముందుకు దూసుకొచ్చి ప‌వ‌న్‌పై ఎడాపెడా విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పక్కా  ఆదేశాల మేర‌కే పేర్ని నాని మీడియా ముందుకొచ్చి, ప‌వ‌న్‌ను టార్గెట్ చేయ‌డం విశేషం.

అయితే జగన్ మో హన్ రెడ్డి లేవ‌నెత్తిన ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లిష్ మీడియం అంశం గురించి మాత్రం  పవన్ సూటిగా స్పందించలేదు. మ‌రోప‌క్క ప‌వ‌న్ లేవ‌నెత్తిన  ఇసుక కొరత అంశంతోపాటు తెలుగు మీడియంపై చిన్న చూపు వద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తోన్న భాషాభిమానులకు మంత్రి స్థాయిలో పేర్ని నాని  స‌రైన‌ సమాధానం చెప్పలేక చేతులెత్తేశారు.

Read more RELATED
Recommended to you

Latest news