కల్వకుర్తి కాంగ్రెస్ విజయభేరీ యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోటీ జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజల కలలు నిర్వీర్యమయ్యాయి. లక్షల కోట్లు దోచుకొని ఒక్క ప్రాజెక్టును కూడా సరిగ్గా కట్టలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ అప్పుల ఊబిలో పడింది. ఇప్పుడు ఉన్న సీఎం తనకు తాను రాజులా భావిస్తున్నారు. నాగార్జున సాగర్, జూరాల, సింగూరు ప్రాజెక్టులు అన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించామని గుర్తు చేశారు.
ప్రజల నుంచి సీఎం కేసీఆర్ చాలా సొమ్ము దోచుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ముందుగా సీఎం కేసీఆర్ బైబై.. ప్రజల నుంచి కేసీఆర్ దోచిన డబ్బుపై ప్రశ్నిస్తాం. ఆ తరువాత తిరిగి ప్రజల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. నేను ఇచ్చిన హామీ అమలు చేసి తీరుతానని కల్వకుర్తి సభలో స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. అటు ధరణి పోర్టల్ ద్వారా కేసీఆర్ 20 లక్షల మంది దగ్గర భూములు లాక్కున్నారని రాహుల్ ఆరోపించారు. అందుకోసమే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఓడించాలి. 500 రూపాయలకే తెలంగాణలో సిలిండర్ ఇవ్వబోతున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు రాహుల్ గాంధీ.