కేసీఆర్ అనే తేలును ఓటు అనే ఆయుధంతో కొట్టాలి : తుమ్మల

-

బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్… శివలింగంపై తేలు వంటి వారని అభివర్ణించారు. తేలును కొడదామంటే కింద తెలంగాణ అనే లింగం ఉంటుందని అన్నారు. అందుకే కేసీఆర్ అనే తేలును ఓటు అనే ఆయుధంతోనే కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని సూచించారు. అహంకారానికి, ఖమ్మం ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచేలా ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 11వ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో తుమ్మల మిత్ర మండలి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తుమ్మల హాజరై ప్రసంగించారు.

Telangana: టికెట్‌ లేకపోతే పార్టీలో ఎందుకుండాలి? | What About Former  Minister Tummala Nageswara Rao In TRS - Sakshi

మంత్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పాపానికి సామినేని సాయి గణేష్ అనే యువకున్ని అక్రమ కేసులు పెట్టి వేధించి, అతని ఆత్మ హత్యకు కారణం అయ్యారని ఇది చాలా బాధాకరమైన విషయం అన్నారు. ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలనే తలంపుతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పట్టుబట్టి నన్ను ఖమ్మం నుంచి పోటీ చేయించారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా చూస్తామని, సాయి గణేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకోండ రాధాకిషోర్, యెర్నేని రామారావు, కార్పొరేటర్లు నాగండ్ల దీపక్ చౌదరి, ధుద్దుకూరి వెంకటేశ్వరరావు, వనం మణికంఠ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news