“ముజీబ్ ఉర్ రెహ్మాన్” ఆఫ్ఘనిస్తాన్ పాలిట శాపమయ్యాడు… లేదంటే చరిత్రే !

-

వరల్డ్ కప్ లో నిన్న ముగిసిన మ్యాచ్ ఇంకో వందేళ్లు గుర్తు పెట్టుకునే అవకాశం ఉంది. ఒక టీం 292 పరుగుల లక్ష్యంలో 91 పరుగులకే 7 వికెట్లు పడిపోతే, ఎవరైనా గెలుస్తుంది అనుకుంటారా ? కలలో కూడా ఇది సాధ్యం కాదు. కానీ ఒక్కడే గెలిపించి చూపించాడు.. ప్రత్యర్ధులు సైతం ముక్కునవేలేసుకునే ప్రదర్శన చేసి ఔరా అనిపించుకున్నాడు. మాక్స్ వెల్ ఒక్కడే ఆసాధారణ పోరాటపటిమతో డబుల్ సెంచరీ (201) చేసి మ్యాచ్ ను మరో బంతులు మిగిలి ఉండగానే ముగించి సగర్వంగా తన జట్టును సెమీస్ కు చేర్చాడు. అయితే మాక్స్ వెల్ కు రెండు సార్లు క్యాచ్ గా అవుట్ అయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ముఖ్యంగా ఫైన్ లెగ్ లో మాక్స్ వెల్ షాట్ ఆడబోయి ఇచ్చిన క్యాచ్ ను స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్ వదిలి వేయడమే ఓటమికి పునాది పడింది అని చెప్పాలి.

అప్పటికి మాక్స్ వెల్ కనీసం అర్ద సెంచరీ కూడా చేయలేదు. అప్పుడే అవుట్ అయి ఉంటె ఆస్ట్రేలియా కేవలం పరుగుల లోపే ఆల్ అవుట్ అయి ఉండేది.. ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించేది.. కానీ అంతా విధిరాత అనుకోవడం తప్పితే చేసేది ఏమీ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news