గోదావరి-కావేరి అనుసంధానంపై రాష్ట్రాల సుముఖత

-

నదుల అనుసంధానంపై చకచకా అడుగులు పడుతున్నాయి. నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్‌ వెదిరెశ్రీరాం అధ్యక్షతన……. హైదరాబాద్‌ జలసౌధలో జాతీయ నీటిఅభివృద్ధిసంస్థ- ఎన్​డబ్ల్యూడీఏ, టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా నదులఅసనుసంధాన ప్రాజెక్టులతోపాటు గోదావరి-కావేరి, బెడ్తి-వార్ధాలింక్‌లపై ఆయారాష్ట్రాలతో వెదిరెశ్రీరాం, ఎన్​డబ్ల్యూడీఏ డైరెక్టర్‌ జనరల్‌ భూపాల్‌ సింగ్‌.. ముఖ్య ఇంజనీర్‌ శంఖ్వా చర్చించారు. ముసాయిదా ప్రాజెక్టు నివేదికపై.. అభిప్రాయాలను నమోదుచేశారు.

తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, ఎస్‌ఈ కోటేశ్వరరావు ఆన్‌లైన్‌ ద్వారా ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్‌ కుమార్‌, ఈఎన్సీ నారాయణరెడ్డి, సీడబ్ల్యూసీ బృందం, ఇతర రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ట్రైబ్యునల్ కేటాయింపులకు ఇబ్బందిలేనంత వరకు గోదావరి జలాల తరలింపునకు ఇబ్బంది లేదని తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులు స్పష్టం చేశారు. గోదావరి-కావేరీ అనుసంధానంలో ప్రతిపాదించిన నీటి వాటా కంటే ఎక్కువ భాగం కావాలని కోరారు.

భూసేకరణ వీలైనంత తక్కువగా ఉండాలన్న తెలంగాణ ప్రతిపాదిత ఆనకట్టను ఇచ్చంపల్లి కంటే కాస్త పైన ఉంటే సమ్మక్క ఆనకట్టకి బ్యాక్‌వాటర్స్‌తో ఇబ్బంది ఉండబోదని పేర్కొంది. ఎక్కువ వాటా కావాలన్న తెలంగాణ విజ్ఞప్తిని ఎన్​డబ్ల్యూడీఏ పరిశీలిస్తుందని టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ వెదిరె శ్రీరాం తెలిపారు. తొలిదశలో కేవలం 400 హెకార్ల భూసేకరణ మాత్రమే అవసరమని వివరించారు. నిర్వాసితులకు ఉత్తమ ప్యాకేజీ ఉంటుందన్న ఆయన.. ఎన్​డబ్ల్యూడీఏ బృందం ఇచ్చంపల్లి ప్రాంతాన్ని సందర్శించి సమ్మక్క ఆనకట్ట బ్యాక్ వాటర్స్ ప్రభావం లేకుండా ఖచ్చితమైన ప్రాంతాన్ని నిర్ధారిస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news