మేనిఫెస్టోలో లేని వాటిని కూడా బీఆర్ఎస్ ఇచ్చింది : తలసాని

-

టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ పట్ల విశ్వాసంతో ఉన్నారని మంత్రి తలసాని అన్నారు. మేనిఫెస్టోలో లేనివి కూడా బీఆర్ఎస్ నెరవేర్చిందన్నారు మంత్రి తలసాని. కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Revanth Reddy should mind his language: Talasani Srinivas Yadav

బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ కేవలం 22 అసెంబ్లీ టిక్కెట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడటం విడ్డూరమన్నారు మంత్రి తలసాని. ప్రజాప్రతినిధులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారన్నారు. ప్రజలు అతని భాషను గమనించాలని కోరారు. రేవంత్ రెడ్డి ఒక్కడికే ఆ భాష వస్తుందా? అన్నారు. తమకు టిక్కెట్లు దక్కలేదని కాంగ్రెస్ బీసీ నేతలు ఢిల్లీలో ధర్నా చేసిన విషయం కూడా చూశామన్నారు మంత్రి తలసాని. ఈ నెల 17వ తేదీ నుంచి హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్డు షో, 25న కేసీఆర్ బహిరంగ సభ ఉంటాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభంజనం ఉంటుందన్నారు మంత్రి తలసాని.

Read more RELATED
Recommended to you

Latest news