పండుగల సీజన్‌పై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి

-

దీపావళి/ఛత్ పూజా సీజన్‌లో, రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మరియు ప్రయాణీకుల అదనపు రద్దీని అధిగమించడానికి దక్షిణ మధ్య రైల్వే సాధారణ, రోజువారీ ఎక్స్‌ప్రెస్ మరియు ప్యాసింజర్ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రైలు ప్రయాణీకుల ప్రయోజనం కోసం జోన్‌లోనే కాకుండా జోన్ వెలుపలి గమ్యస్థానాలకు కూడా ప్రత్యేక రైళ్లు నడపబడుతున్నాయి. భారతీయ రైల్వేలలో, సాధారణ రైళ్లకు అదనంగా పండుగ ప్రత్యేక రైళ్లలో సుమారు 26 లక్షల అదనపు బెర్త్‌లతో ప్రయాణికులకు కల్పిచడం జరిగింది . .

South Central Railways achieves electrification of 1017 Rkms in FY 2022-23

పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈ సమయంలో రైళ్లను సకాలంలో నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ కాలంలో రైళ్లు సమయానికి గమ్యస్థానం చేరుకునేలా అన్ని స్థాయిలలో – స్టేషన్, డివిజన్లు మరియు జోన్‌లలో రైళ్ల యొక్క నిరంతర పర్యవేక్షణ జరుగుతోంది.

రైళ్లు ప్రారంభమయ్యే అన్ని ప్రధాన యార్డులలో, నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేయడం , రైళ్లను సకాలంలో ప్రారంభించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రైళ్లను సమయానికి నడపడానికి అన్ని డివిజన్లలో విభాగాల మధ్య నిరంతరం సమన్వయం జరుగుతుంది. ఈ రద్దీ సీజన్‌లో తమ రైళ్లు సమయపాలన పాటించేలా చూసేందుకు ఇంటర్-జోనల్ రైళ్లకు ఇదే విధమైన శ్రద్ధ వహిస్తున్నారు

ప్రయాణీకుల ప్రయాణ అవసరాలను తీర్చడానికి, దక్షిణ మధ్య రైల్వే మాదిరిగానే, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని జోనల్ రైల్వేలు ప్రత్యేక ట్రిప్పులను నడపడానికి సన్నద్ధమయ్యాయి. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి వివిధ రాష్ట్రాల నుంచి కనెక్టివిటీని నిర్ధారిస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు అన్ని ప్రధాన స్టేషన్లలో స్టాపేజ్ సౌకర్యాన్ని అందిస్తాయి, ఇవి ఆయా మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి

ప్రయాణీకుల అదనపు రద్దీకి సంబంధించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని మరియు రైళ్లను సమయానుకూలంగా నడిపేందుకు సకాలంలో చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీఅరుణ్ కుమార్ జైన్ గారు డివిజనల్ రైల్వే మేనేజర్లు మరియు డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ హెడ్‌లను ఆదేశించారు. స్టేషన్లలో రద్దీని పర్యవేక్షించాలని , తద్వారా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేరుకునేలా రైళ్ల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అదికారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news