ప్రతీ తెలంగాణ పౌరుడికి రూ.లక్ష అప్పు : చిదంబరం

-

తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణతో తనకు 2008 నుంచి మంచి అనుబంధం ఉందని తెలిపారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం తెలంగాణలోనే ఉందన్నారు. రాష్ట్రంలో ద్రవ్యోల్భణం, నిరుద్యోగం బాగా పెరిగిందని తెలిపారు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ అని.. నిత్యవసర ధరలు కూడా భారీగానే పెరిగాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు చాలా ఎక్కువగానే ఉన్నాయి.

అత్యధిక వ్యాట్ వసూలు చేస్తుంది తెలంగాణలోనే అని స్పష్టం చేశారు. నిరుద్యోగ రేటు 7.8(పురుషులు), 9.5(మహిళలు)గా ఉంది. గ్రామీణ నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ. రాష్ట్రంలో 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర అప్పులు 3.66 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే దాదాపు తెలంగాణలో ప్రతీ పౌరుడికి రూ.1లక్ష అప్పు ఉందని వెల్లడించారు పి.చిదంబరం. దీంతో సంక్షేమ పథకాల అమలు కష్టంగా మారింది. విద్య, వైద్యానికి కేటాయింపులు దారుణంగా పడిపోయాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ కి ఒక్క అవకాశం కల్పించాలని కోరారు చిదంబరం.

Read more RELATED
Recommended to you

Latest news