కొల్లాపూర్ వార్: పైచేయి ఎవరిది?

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. గెలుపు కోసం అన్ని పార్టీలు తమ వ్యూహాలని సిద్ధం చేసుకున్నాయి. 13 రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం లో దూకుడుగా ఉన్నారు. ఇదే క్రమంలో కొల్లపూర్ లో వార్ తీవ్రంగా నడుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుంది.

గత ఎన్నికల్లో ఈ ఇద్దరే పోటీ పడ్డారు అప్పుడు పార్టీలు వేరు..కాంగ్రెస్ నుంచి బీరం పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ నుంచి జూపల్లి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు బీరం బీఆర్ఎస్ నుంచి, జూపల్లి కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి సుధాకర్ రావు పోటీ చేస్తున్నారు.

 

ఇక్కడ ప్రధాన పోటీ బీరం, జూపల్లి మధ్యే ఉంటుంది. మళ్ళీ జూపల్లికి చెక్ పెట్టి గెలవాలని బీరం చూస్తుంటే..బీరంని ఓడించి రివెంజ్ తీర్చుకోవాలని జూపల్లి చూస్తున్నారు.
ప్రస్తుతం ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. మరి చివరికి వీరిలో ఎవరు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news