మేము “చోకర్స్” కాదు ఎమోషనల్ అయిన సౌత్ ఆఫ్రికా కోచ్ !

-

నిన్న జరిగిన వరల్డ్ కప్ సెమి ఫైనల్ 2 మ్యాచ్ లో ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా లు తలపడగా అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన కమిన్స్ సేన మూడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. కానీ సౌత్ ఆఫ్రికా పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్ లతో రెచ్చిపోతున్నారు. సౌత్ ఆఫ్రికా చోకర్స్ అంటూ మెసేజ్ లు చేస్తూ వారిని ఓటమి బాధలో ఉండగా ఇంకా కృంగదీస్తున్నారు. ఇందుకు సౌత్ ఆఫ్రికా కోచ్ రాబ్ వాల్టర్ తాజాగా స్పందించడం జరిగింది. ఎందుకు మమ్మల్ని చోకర్స్ అంటున్నారు .. ఒకదశలో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుండి 212 పరుగుల వరకు చేరుకున్నాము అంటూ వాల్టర్ వారికీ సమాధానం ఇచ్చాడు.

మేము అద్భుతంగా పోరాడాము కాబట్టే మ్యాచ్ 48వ ఓవర్ వరకు వచ్చింది మరియు ఆస్ట్రేలియా 7 వికెట్లను కోల్పోయేలా చేశాము.. కానీ మాకన్నా గొప్పగా ఆడిన అసూత్రాలైనా విజయం సాధించినంత మాత్రాన మమ్మల్ని అలా అనడం సరికాదు అంటూ వాల్టర్ ఎమోషనల్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news