ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత

-

పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ లో ఉన్న ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. దక్షిణ ఫిలిప్పీన్స్ లో సంభవించిన ఈ భూకంపం తీవ్రతకు భవనాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత 6.2 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. భూకంపం కారణంగా ఒకరు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. మిండానావో దీవికి సమీపంలో 60 కి.మీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఎలాంటి సునామీ హెచ్చరికలు లేకపోవడంతో ఫిలిప్పీన్స్ తీర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

One dead, dozens injured as earthquake hits central Philippines |  Earthquakes News | Al Jazeera

కాగా.. జపాన్ నుండి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించిన తీవ్రమైన భూకంప, అగ్నిపర్వత కార్యకలాపాలకు ఆలవాలమైన పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” వెంబడి ఉన్న ఫిలిప్పీన్స్ లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి. ఇదిలా ఉండగా.. ఈశాన్య మయన్మార్ లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. షాన్ రాష్ట్రంలోని కెంగ్ తుంగ్ పట్టణానికి నైరుతి దిశగా 76 కిలోమీటర్ల దూరంలో 5.7 తీవ్రతతో భూకంపం కేంద్రీకృతమైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉంది. ఒక్క సారిగా వచ్చిన ఈ ప్రకంపనలతో కెంగ్ తుంగ్ సిటీ వణికిపోయింది. భూకంపం వచ్చిన ఈ ప్రాంతం చైనా, లావోస్, థాయ్ లాండ్ సరిహద్దులకు సమీపంలో ఉంది. ఈ ప్రకంపనల తీవ్రత థాయ్ లాండ్ లోని రెండో అతిపెద్ద నగరం, ప్రముఖ పర్యాటక కేంద్రం చియాంగ్ మాయిలోనూ కనిపించాయి. కాగా.. మయన్మార్ లో భూకంపాలు, భూకంపాలు సర్వసాధారణం. అయితే తాజా భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news