వన్డే వరల్డ్ కఫ్ 2023లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ లో టీమిండియా యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 7 బంతులు ఆడిన గిల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టీమిండియా బ్యాటింగ్ ను ఆహ్వానించాడు. ఐదో ఓవర్ లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో రెండో బంతిని గిల్ మిడాన్ దిశగా షాన్ ఆడటానికి ప్రయత్నించాడు.
షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బంతి మిడాన్ లో ఉన్న ఆడమ్ జంపా చేతికి బంతి వెళ్లింది. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అలాగే కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా విరాట్ కోహ్లీ షాక్ కి గురయ్యాడు. అప్పుడు హాఫ్ సెంచరీ చేసిన ఒక్కసారిగా బౌల్డ్ అయ్యే సరికి స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. అదే సమయానికి సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చి సిక్స్ ల మోత మ్రోగిస్తాడుకుంటే.. జడేజా క్రీజులోకి వచ్చాడు.