తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు తథ్యం : రేణుకా చౌదరి

-

ఖమ్మం జిల్లాలో ఇవాళ రేణుకా చౌదరి మీడియా సమావేశంలో మాట్లాడారు. పలు కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు అధికారం మదంతో విర్రవీగుతున్నారని పేర్కొన్నారు. ఏది ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 03న గెలవబోతుంది. డిసెంబర్ 09న కాంగ్రెస్ అభ్యర్థి ప్రమాణం చేస్తారని రేవంత్ రెడ్డి చెప్పినట్టే జరుగుతుందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు పదే పదే ఎందుకు వాయిదా పడుతున్నాయని ప్రశ్నించారు. ఐటీలో కేటీఆర్ కింగ్ అంటారు.. కానీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వరు అన్నారు. ఖమ్మం జిల్లాలలోనే కాదు.. ఇతర నియోజకవర్గంలో తిరిగినా.. అక్కడ కూడా ఊహించని స్పందన కనిపిస్తుందని రేణుకా చౌదరి వెల్లడించారు.

రైతులకు బేడీలు వేసింది బీఆర్ఎస్.. కాంగ్రెస్ ను ప్రజలు మరిచిపోలేదు. కేవలం దూరమయ్యారు. ఇప్పుడు అందరూ మన దగ్గరికీ వచ్చారని తెలిపారు. పేదవాడికి నిజమైన ఇల్లు ఉందంటే.. కాంగ్రెస్ పార్టీ కేటాయించిన ఇందిరమ్మ ఇల్లు అనే చెప్పాలి. టీడీపీ వాళ్లు మాకు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి సాగనంపాలనే కాంగ్రెస్ కి మద్దతు పలుకుతున్నారని వెల్లడించారు రేణుకా చౌదరి. పేద ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీకిి ఓటు వేయండి అభ్యర్థించారు.

Read more RELATED
Recommended to you

Latest news