తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల బరిలో ప్రధానంగా మూడు పార్టీలు అధికారాన్ని దక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో అధికార , బీజేపీ మరియు కాంగ్రెస్ లు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇక ఎన్నికలకు కేవలం తొమ్మిది రోజులు సమయం మాత్రమే ఉంది. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్నికలకన్నా ముందే అప్పుడే తొలి ఓటు నమోదు అయినట్లుగా అధికారిక సమాచారం అందింది. తెలంగాణాలో మొదటిసారిగా దివ్యాంగుల మరియు వృద్ధుల కోసం హోమ్ ఓటింగ్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పద్ధతి ద్వారా ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన అన్నపూర్ణ చుండూరి (91) ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక ఈమె ఓటును వేసిన అనంతరం ఎన్నికల అధికారులు, పోలీసులు పోస్టల్ బ్యాలెట్ ను తీసుకువెళ్లారు. ఈ ఎన్నికలలో మొదటి ఓటును వేసిన మహిళగా రికార్డు సృష్టించింది. మరి ఈమె ఏ పార్టీకి ఓటు వేసింది అన్న విషయం మాత్రమే ఇంకా తెలియదు.