తెలంగాణాలో నవంబర్ 30వ తేదీన జరగనున్న ఎన్నికలలో BRS,కాంగ్రెస్ మరియు బీజేపీ లు విజయం మాదంటే మాదే అంటూ ధీమాను వక్తం చేస్తున్నాయి. ఇక తాజాగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బీజేపీ తరపున ప్రచారం చేయడానికి వచ్చి పలు చోట్ల తిరుగుతున్నారు, ఇక ఈ రోజు ఆర్మూరులో జరిగిన సభలో మాట్లాడిన అమిత్ షా.. గత ఎన్నికల్లో మీకు గుర్తుందో లేదో… కేసీఆర్ ను గెలిపిస్తే దళితుడిని సీఎం చేస్తానంటూ బూటకపు మాటలు చెప్పి తప్పాడు, మళ్ళీ అదే మాట తప్పే నాయకుడు కావాలనుకుంటున్నారా అంటూ ప్రశ్నించాడు. ఈ ఎన్నికల్లో మీరు ఆశీర్వదించి బీజేపీని గెలిపిస్తే తెలంగాణ సీఎంగా ఒక బీసీ కులానికి చెందిన నాయకుడు ఉంటాడని బలంగా చెబుతున్నాను అంటూ అమిత్ షా మాటిచ్చారు.
పేదలకు భారంగా మారిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను సైతం తగ్గిస్తాము అంటూ అమిత్ షా ఓట్ల కోసం ప్రజలకు హామీలనుఁ ఇచ్చారు. మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ 3వరకు ఆగాల్సిందే.