చంద్రబాబుకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ !

-

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 8 లోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులను జారీ చేసింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాలు ఎక్కడ మాట్లాడకూడదని ఆయనకు సూచించింది. అయితే ర్యాలీలో రాజకీయ కార్యకర్తలలో పాల్గొనవచ్చు అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈనెల 24 ఇచ్చిన సాధారణ బైలును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడి ఆ నిధులను తెలుగుదేశం పార్టీ ఖాతాలకు మళ్లించారు అనేందుకు సిఐడి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదంటూ చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్తిస్థాయి బయలుఇచ్చింది దీనిని సవాలు చేస్తూ సిఐడి ఈనెల 21న సుప్రీంకోర్టులో ఓ పిటీషన్ వేసింది. అయితే బెయిల్ పై ఎటువంటి షరతులు లేవంటూ ఇటీవల హైకోర్టు తీర్పు తీర్పునిచ్చింది. తాజాగా
హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించింది సుప్రీం కోర్టు. బాబు ఎలాంటి ర్యాలీలు నిర్వహించరాదు.. కేసుకు సంబందించిన అంశాలను బహిరంగంగా మాట్లడరాదు అని తెలిపారు. తదుపరి విచారణ డిసెంబరు 8 కి వాయిదా వేశారు. తదుపరి విచారణవరకు షరతులు అమల్లో ఉంటాయన్న సుప్రీం కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news