గజ్వేల్ ప్రజలకు గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ మరో కీలక హామీ..!

-

గజ్వేల్ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరొక కీలక హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఇవాళ చివరి రోజు సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే ఒక్క విడుదలనే గజ్వేల్ లో దళిత బంధు అమలు చేస్తామని కీలక హామీ ఇచ్చారు. అంతేకాదు.. గజ్వేల్ కు కచ్చితంగా ఐటీ కారిడార్ తీసుకొస్తామని మాట ఇచ్చారు. ఐటి టవర్ కోసం ఇప్పటికే కేటీఆర్ కి చెప్పారని తెలిపారు కేసీఆర్. కొండపోచమ్మ ఆలయాన్ని మరింత అద్భుతంగా మార్చుకుందామన్నారు.

బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్ ఒక రోల్ మోడల్ గా ఎదిగిందని.. గజ్వేల్ అభివృద్ధిని చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి కోమటిబండ అభివృద్ధి చూశారని గుర్తు చేశారు. గజ్వేల్ లో నన్ను రెండుసార్లు గెలిపించాలని ముచ్చట మూడోసారి ఆశీర్వదిస్తే కొండపోచమ్మ మల్లన్న సాగర్ అభివృద్ధి చేసుకుందామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు ఇవాళ గజ్వేల్ లో పాల్గొన్నది 96వ సభ అని ఇదే ఒక చివరి సభా అని పేర్కొన్నారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news