నంద్యాలలో ఆరుగురు ఇంటర్‌ విద్యార్థులకు శిరోముండనం!

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా చోటు చేసుకుంది. నంద్యాలలోని ఓ ప్రైవేట్ కాలేజీలో సోమవారం రాత్రి సీనియర్, జూనియర్ విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకుని కొట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన కాలేజీ యాజమాన్యం వారిని దండించడం కోసం కఠిన చర్యలకు పూనుకుంది.

Another-Siromundanam-case-in-AP

ఈ క్రమంలో మంగళవారం విద్యార్థులను కర్రతో కొట్టించారు. దీంతో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక విద్యార్థికి చెయ్యి విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మరో ఆరుగురు విద్యార్థులకు కాలేజీ సిబ్బంది శిరోముండనం చేయించారు. దీంతో ఈ విషయం పట్టణమంతా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news