ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇవాళ వైయస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కి సంబంధించిన నిధులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు 65 లక్షల మందికి 1800 కోట్లను రిలీజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక ఇవాళ తెల్లవారుజాము నుంచే వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేయనుంది ప్రభుత్వం.
ఐదు రోజులలో 100% పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తామని అటు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు వెల్లడించారు. పింఛన్ పంపిణీ కోసం 2.66 లక్షల మంది వాలం టీర్లు ఉన్నారని…లబ్ధిదారులకు పింఛన్ అందజేసే సందర్భంలో గుర్తింపు కోసం ఆధార్ నిర్ధారిత బయోమెట్రిక్ మరియు ఐరిష్ తదితర విధానాలను అమలు చేస్తున్నామని ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికి పింఛను అందలేదని ఫిర్యాదు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.