తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేనా..? లెక్కలు ఇవే

-

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేనా..? అంటే అవుననే అంటున్నారు కొంత మంది విశ్లేషకులు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 29 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 15 స్థానాల వరకు BRS అవలీలగా గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. 6-7 స్థానాలు MIM గెలుచుకునే అవకాశం హైదరాబాద్ లో ఉండగా 4-7 స్థానాలు బీజేపీ… తెలంగాణ రాష్ట్రం మొత్తము లో గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడిస్తున్నాయి నివేదికలు.

అంటే మిగిలిన 88-91 స్థానాల లో కాంగ్రెస్ 60 స్థానాలు గెలుచుకోవాలన్న మాట. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో 73% పైన పోలింగ్ అయితే ఈ అసెంబ్లి ఎన్నికల్లో 70 శాతంగా ఉంది. కాంగ్రెస్ కు 8-10% స్వింగ్ రాని పక్షంలో వారు సింపుల్‌ మెజారిటీ దాటడం అసంభవం అని అంటున్నారు. Psephology సిద్ధాంతాల ప్రకారం ఓటింగ్ శాతం పెరగని పక్షం లో అలాంటి స్వింగ్ రావడం కష్ట సాధ్యం అని చెబుతున్నారు. అంతే కాకుండా BRS పోయిన ఎలక్షన్స్ లో 30 వేల పైన మెజారిటీ సాధించిన స్థానాలు 60 పైన ఉన్నాయి. కాబట్టి Exit Polls ను నమ్మవలసిన అవసరం లేదని కూడా చెబుతున్నారు. మరి డిసెంబర్‌ 3న దీనిపై క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news