ఏపీలో టీడీపీ, తెలంగాణ లో బీజేపీ జనసేన కలవటం పై వైసీపీ విమర్శలు చేస్తోంది అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అసలు ఈ మాట అనటానికి వైసీపీకి అర్హత లేదు. హైద్రాబాద్ లో 50 శాతం కూడా పోలింగ్ జరగలేదు. యువత ఓటింగ్ కు దూరంగా ఉండటం బాధ కలిగింది అన్నారు. తాను ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటాను.
నేను ఏం చేసినా కోట్లాది మంది నీ దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేస్తాను. టీడీపీ, జనసేన కలిసి వెళ్ల టానికి కారణాలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో టీడీపీ, జన సేన కలిసి పని చేస్తాయి. వైసీపీ నీ ఎదుర్కొంటానికి టీడీపీ, జన సేన కలిశాయి. ప్రతి పక్షం బ్రతకల్సిన పరిస్థితి ఉంది. వైసీపీ పాలన లో మెగాస్టార్ ను, సూపర్ స్టార్ ను బెదిరించే పరిస్థితి నెలకొంది అని తెలిపారు. మరోవైపు సీఎం పదవి ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు..? నన్ను ఎమ్మెల్యే గా గెలిపించలేదు. నాకు ఓటు వేసిన వారు ఈ ప్రశ్న అడిగితే గౌరవంగా ఉంటుంది. కానీ ఓటు వేయని వారు ఇపుడు సీఎం చేస్తాం అంటున్నారు