బంగ్లాదేశ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో ఆతిధ్య జట్టు పట్టు బిగిస్తోంది. ఈ టెస్ట్ లో ఈ రోజు నాలుగవ రోజు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 113 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. అంతకు ముందు బంగ్లాదేశ్ రెండవ ఇన్నింగ్స్ లో 338 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. శాంటో సెంచరీ తో చెలరేగగా, రహీమ్ మరియు మిరాజ్ లు అర్ద సెంచరీ లు చేశారు. అనంతరం న్యూజిలాండ్ 332 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే కివీస్ ఆశించిన రీతిలో ఆడడంలో దారుణంగా విఫలం అయింది. కీలక ప్లేయర్లు అందరూ పెవిలియన్ బాట పట్టారు. కాన్ వే 22, లాతమ్ 0, విలియమ్సన్ 11, నికోలస్ , బ్లాండెల్ 6, ఫిలిప్స్ 12 లు ఘోరంగా ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. ప్రస్తుతం క్రీజులో మిచెల్ ఒక్కడే 44 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు.
ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరి కివీస్ గెలవాలంటే ఇంకా 219 పరుగులు చేయాల్సి ఉంది. ఖచ్చితంగా ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.