ప్రతిపక్ష పాత్రలో కూడా రానిస్తాం : కేటీఆర్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు విజయం సాధించిన విసయం తెలిసిందే. అయితే తెలంగాణ రెండో ముఖ్యమంత్రి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. దీంతో కొంత మంది సీనియర్లు కాస్త గుర్రుగా ఉన్నప్పటికీ అధిష్టానం బుజ్జగించడంతో అందరూ రేవంత్ రెడ్డి సీఎం కావడానికి సహకరించారని తెలిసింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి పలువురు ముఖ్యమంత్రులను, కాంగ్రెస్ పార్టీ అధినాయకులను, కీలక నేతలను ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పాత్రలో కూడా తాము రాణిస్తామని చెప్పారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని.. కొంత కాలమే ఉంటుందని తెలిపారు.  తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు వదులుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో అనుకోని ఫలితాలు సహజమేనని తెలిపారు. నిరాశ చెందాల్సిన ఎంత మాత్రం లేదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news