ప్రగతి భవన్ చుట్టూ ఇనుప కంచెలు బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడైనా రావచ్చు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ ప్రగతి భవన్ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారి ఎల్బీస్టేడియంలో నిర్వహించిన సభలో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
తెలంగాణ ఎన్నో త్యాగాల, పునాదుల మీద రాష్ట్రం అని తెలిపారు. ప్రగతి భవన్ వద్ద ఇనుప కడ్డీలను బద్దలు కొట్టించాను. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావుపూలే ప్రజాభవన్ లో ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నామని.. మీరందరూ హాజరుకావాలని కోరారు. నగర అభి ద్ధి కోసం శాంతి భద్రతలను కాపాడుతూ.. ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ముందుకు వెళ్తామని తెలిపారు. ఏ దిక్కు లేదనే పరిస్థితి లేకుండా ఉండకుండా చూస్తాను. పేదరికాన్ని తరిమికొడతానని తెలిపారు. అమరవీరుల ఆకాంక్షను నెరవేరుస్తాం. ప్రభుత్వం ఏర్పడటానికి లక్షలాది మంది కార్యకర్తలు త్యాగాలను మరిచిపోమన్నారు.