తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రసంగించారు. ప్రధానంగా ప్రగతి భవన్ చుట్టూ ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రజలు ఎప్పుడైనా రావచ్చని తెలిపారు. తెలంగాణ ఎన్నో త్యాగాల, పునాదుల మీద రాష్ట్రం అని తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావుపూలే ప్రజాభవన్ లో ప్రజా పూజను నిర్వహిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం బాధలు పట్టించుకోలేదు. అమర వీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావచ్చు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు అని తెలిపారు రేవంత్ రెడ్డి.
నగర అభి ద్ధి కోసం శాంతి భద్రతలను కాపాడుతూ.. ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ముందుకు వెళ్తామన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా.. 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 6 గ్యారెంటీల ఫైల్ పై తొలి సంతకం చేశారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా నిరుద్యోగి దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం ఇస్తూ రెండో సంతకం ఫైల్ పై పెట్టారు సీఎం కేసీఆర్. రజినీకి అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇచ్చారు.