రైతుబంధు నిధుల విడుదలపై తెలంగాణ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులకు వందలాది ఎకరాల భూమి ఉందని.. వారికి లాభం కలుగుతుందని హరీశ్ రావు రైతుబంధు గురించి ప్రస్తావించారని సీతక్క మండిపడ్డారు.
అందుకే ఇప్పుడు పెద్ద ఫాం హౌస్ ల ఓనర్లు, మాజీ మంత్రులు, రైతు బంధు రాలేదని బాధ పడుతున్నారని చురకలు అంటించారు. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించిన తరువాత రైతులకు డబ్బులు చెల్లిస్తామని స్పష్టం చేశారు సీతక్క. దింతో రైతుబంధు నిధుల విడుదలపై పెద్ద గందర గోళం చోటు చేసుకుంది. రైతుబంధు నిధుల విడుదలపై కాంగ్రెస్ సర్కార్ ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టబోతుందని సమాచారం. ఎక్కువ ఎకరాలు ఉన్నవారికి రైతుబంధు ఇవ్వదని ప్రచారం జరుగుతోంది.