తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజుల కిందట తన ఫామ్ హౌస్ లో ఉన్న బాత్రూంలో కింద కెసిఆర్. ఈ నేపథ్యంలోనే ఆయన తొంటి వెనుక తిరిగింది. దీంతో కెసిఆర్ ను వెంటనే యశోద ఆసుపత్రికి ఆయన కుటుంబ సభ్యులు తరలించారు. ఈ తరుణంలోనే తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆపరేషన్ కూడా చేశారు వైద్యులు.
ఇక నిన్న వైద్యుల సహాయంతో నడిచారు కేసీఆర్. నిన్న అంటే సరిగ్గా డిసెంబర్ 9వ తేదీ 2023. అయితే 2009 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ఉద్యమం కోసం నిరాహార దీక్ష చేసి… దీక్షను విరమించారు కేసీఆర్. ఆ తర్వాత తెలంగాణ సాధ్యమైంది. ఇప్పుడు ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ కూడా గుర్తు చేశారు. దీంతో వచ్చే కొన్ని రోజులలోనే కెసిఆర్ మరోసారి… గతంలో లాగే దూసుకు వస్తారని… ముఖ్యమంత్రి అవుతారని కొంతమంది అంటున్నారు.