మేం ఎవరిమీద కక్ష సాధించం.. తప్పులుంటే మాత్రం చర్యలు తప్పవు : మంత్రి కోమటిరెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఎవరిమీద కక్ష సాధించాలని అనుకోవడం లేదని కానీ తప్పు చేస్తే మాత్రం శిక్ష తప్పదని హెచ్చరించారు. రోడ్ల నిర్వహణే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే మంత్రి కోమటిరెడ్డి 9 ఫైల్స్​పై సంతకాలు చేశారు.

నల్గొండ-ముషంపల్లి-ధర్మాపురం రోడ్ నాలుగు లైన్లకు పెంపు, కొడంగల్, దుడ్యాల రోడ్‌ల విస్తీర్ణానికి సంబంధించిన ఫైల్​పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సంతకం చేశారు. రేపు ఎంపీగా రాజీనామా చేస్తానని చెప్పారు. సోమవారం రోజున కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి రాష్ట్ర రోడ్లు గురించి చర్చిస్తానని తెలిపారు. రాష్ట్రంలో 14 రోడ్లకు నేషనల్‌ హైవే హోదా ఇవ్వాలని కోరుతానని వెల్లడించారు. విజయవాడ- హైదరాబాద్ హైవే 6 లైన్లకు పెంచాలని కోరుతామని.. హైదరాబాద్-కల్వకుర్తి రోడ్‌ 4 లైన్ చేయాలని అడుగుతామని.. ఐదు ఫైల్స్‌ను రేపు గడ్కరీకి చూపించి అనుమతి కోరుతామని మంత్రి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news