బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏంటో.. అసెంబ్లీలో చెప్పిన కూనంనేని

-

అసెంబ్లీలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణం చర్చపై మాట్లాడారు. 2023లో కేవలం 11 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచిందన్నారు. వ్యక్తిగత దూషణకు వెళ్లి సభను పక్కదారి పట్టించకుండా మాట్లాడాలన్నారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు పేర్కొన్నారు. అసెంబ్లీని ఎక్కువ రోజులు నడిపేవిధంగా చూడాలన్నారు. 2020లో కేవలం 17 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. వైఎస్ఆర్ ఆనాడు ఇచ్చిన హామీలను నెరవేర్చారన్నారు. హామీలను నెరవేర్చడానికి డబ్బు ఇబ్బంది కాదు అన్నారు.

హామీల అమలుకు కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా నిధులు రావాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లో 2 హామీలను కొత్త ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఇచ్చిన హామీలకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు కూనంనేని. ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమేనన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామనడం మంచిది కాదన్నారు. పాత ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయిందో చెక్ చేసుకొని కాంగ్రెస్ పని చేయాలన్నారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ఉద్యమ పార్టీగా వచ్చిన బీఆర్ఎస్ స్వేచ్ఛను హరించిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news