పాక్ ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా..అగ్ర స్థానంలోకి ఇండియా

-

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 తాజా ర్యాంకింగ్స్ లో టీమిండియా మరోసారి అగ్రస్థానానికి చేరింది. తాజాగా ఆసీస్ తో జరిగిన తొలి టెస్ట్ లో ఘోరంగా ఓడటంతో ఇప్పటివరకు టాప్ లో ఉండిన పాక్ రెండో స్థానానికి పడిపోయింది. 2023-25 సైకిల్ లో బోణీ కొట్టింది. ఈ సైకిల్ లో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన ఆసీస్ కేవలం ఒకే మ్యాచ్ లో గెలిచి, 41.67 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో నిలిచింది. భారత్ ఈ సైకిల్ లో ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్ లో విజయం సాధించి, 66.67 పాయింట్ల శాతంతో 16 పాయింట్లు కలిగి టాప్ లో నిలిచింది.

ఆసీస్ చేతిలో ఓటమితో రెండో స్థానానికి పడిపోయిన పాక్ రెండు మ్యాచుల్లో ఓ విజయంతో 66.67 పాయింట్ల శాతం కలిగి ఉంది. ఈ జాబితాలో భారత్, పాక్ ల తర్వాత న్యూజిలాండ్ (50), బంగ్లాదేశ్ (50), ఆస్ట్రేలియా (41.67), వెస్టిండీస్ (16.67), ఇంగ్లాండ్ (15) వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా పాక్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఆసీస్ 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో తొలత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 487 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 233/5 చేయగా.. పాక్ రెండు ఇన్నింగ్స్ లో వరుసగా 271, 89 పరుగులు చేసి చిత్తుగా ఓడింది.

Read more RELATED
Recommended to you

Latest news