ఓటమి భయంలో ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. అవకాశము దొరికితే చాలు ఎదో ఒక విధంగా తప్పుడు ప్రచారo చేసేస్తున్నారు టీడీపీ నేతలు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉంది వైసీపీ అధిష్టానం. ఆఖరికి దీనిపై కూడా అసత్య ప్రచారాన్ని చేస్తోంది. ఓ ఎనిమిది నియోజక వర్గాలకు కొత్త ఇంచారుజులను వైసీపీ నియమించిందని ఒక ఫేక్ లెటర్ ని సృష్టించింది. ఇక ఈ అసత్య ప్రచారాన్ని ఖండించాల్సి వచ్చింది వైసీపీ హైకమాండ్ కి. ఇదంతా సత్యదూరమని చెప్తూ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.ఇది ఏమాత్రం నిజం కాదని, దీన్ని అసలు నమ్మవద్దని తెలియజేసింది.దీనికి సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదల చేయాల్సి వచ్చింది వైసీపీ కి.రెండో జాబితపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇంకా కొలిక్కి రాలేదని స్పష్టం చేసింది.
రెండో జాబితాపై ఇంకా కసరత్తు కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వివరించింది. సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపుల్లో సర్కులేట్ అవుతున్న ప్రెస్ నోట్‌లో పొందుపరిచిన పేర్లు ఏవీ నిర్ధారించలేదని స్పష్టం చేసింది. పార్టీ క్యాడర్‌లో గందరగోళం సృష్టించడానికి రాజకీయ ప్రత్యర్థులు చేస్తోన్న దుష్ప్రచారమని వైఎస్ఆర్సీపీ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది.ఇంతకుముందు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జీలను మార్చిన మాట వాస్తవమే.అయితే దాన్ని ఆధారంగా చేసుకుని ప్రత్యర్థులు….కేడర్ ని నియోజకవర్గాల ఓటర్లను అయోమయానికి గురి చేసేలా ఇష్టానుసారంగా పేర్లను మార్చి ప్రచారం చేస్తోన్నారని విమర్శించింది.