క్యాబ్ డ్రైవర్లు,ఆటో డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ ల కోసం ఐదు లక్షల రూపాయల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహించిన సమావేశంలో వారు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.. ఓలా మాదిరిగా క్యాబ్ డ్రైవర్ల కోసం టీ హబ్ ద్వారా ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం అన్నారు.
క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్స్ ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజాపాలన గ్రామసభలలో దరఖాస్తుల వివరాలు అందించాలని సీఎం రేవంత్ సూచించారు. దరఖాస్తులు మాన్యువల్ , డిజిటల్ ఏ రూపంలోనైనా ఇవ్వవచ్చు అన్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు