ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గతి సోదరి షర్మిల గారి రాజకీయ రంగ ప్రవేశం వైకాపాకు గుదిబండగా మారనుందా?, షర్మిల గారు రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టకపోయినా సర్వేల అంచనాల మేరకు వైకాపా ఔట్, షర్మిల గారి రాజకీయ రంగ ప్రవేశంతో ఔట్ కు నో డౌట్ అనే పరిస్థితులు నెలకొంటాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు 30 స్థానాలు దక్కడం కూడా మృగ్యమేనని అన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు.
రానున్న ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వై.యస్. షర్మిల గారు క్రియాశీలకంగా వ్యవహరించనున్నారని, ఆమెకు జనవరి రెండవ వారంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయని తెలిపారు. అయినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎంత మాత్రం లేవని, కాకపోతే కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును పెంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే… రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతో పాటు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. అధికార వైకాపా మేజర్ ఓటు బ్యాంకు అయిన ఒక వర్గాన్ని షర్మిల గారు, ఆమె భర్త అనిల్ గారు తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.