తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన బండి సంజయ్

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రభుత్వ అధికారులపై ప్రశంసలు కురిపించారు ఎంపీ బండి సంజయ్. బుధవారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నుండి ప్రభుత్వ అధికారులకు విముక్తి లభించిందన్నారు. మొత్తానికి గత ప్రభుత్వం నుండి ప్రభుత్వ అధికారులకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కలిగిందని.. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి పని చేసేందుకు ప్రోత్సహిస్తుందన్నారు.

గత ప్రభుత్వంలో మంత్రులు చెప్పే విధంగా ప్రోగ్రాం లు చేసేవారని.. తాను ఎక్కడి ప్రోగ్రాం కి వెళ్లినా అధికారులు తనని చూసి భయపడుతూ ఉండేవారిని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు ఇష్టం వచ్చినట్లు చేసే వారని.. వారు చెప్పిందే వేదంగా నడిచేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి పని చేసే విధంగా చేసినందుకు అభినందనలు తెలిపారు.

ఇక అంతకుముందు వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో భాగంగా చింతకుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్.. అర్హులైన వారందరూ కేంద్ర పథకాలను వినియోగించుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ ఏ పథకాలను అమలు చేస్తుందనే విషయంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో ప్రచార రధాలు ఊరూరా తిరుగుతున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news