మెదక్ ఎంపీ సీటు కోసం బిజెపిలో ఇద్దరు కీలక నేతల పోటీ

-

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దురదృష్టం వెంటాడిన ఆ ఇద్దరు నేతలు పార్లమెంటు సీటుపై కన్నేశారు.. ఒకే లోక్ సభాస్థానంపై దృష్టి సారించారు.. ఆ ఇద్దరి నేతల్లో టికెట్ ఎవరు కోరిస్తుందా అనే చర్చ మెదక్ పార్లమెంటు పరిధిలో జరుగుతుంది..

తెలంగాణ బిజెపిలో ఈటెల రాజేందర్, రఘునందన్ రావు కీలక నేతలుగా కొనసాగుతున్నారు.. గత ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థుల పైన విజయకేతన ఎగరవేసిన ఇద్దరు నేతలు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.. బిజెపి ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేంద్ర పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు.. ఫలితాల తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న ఇద్దరు నేతలు.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటెందుకు సిద్ధమవుతున్నారు.. ఇద్దరూ మెదక్ లోక్సభ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం పార్టీలో నడుస్తుంది.

సీటు పరిధిలో ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.. ఇంకా ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల నుంచి బిజెపి అభ్యర్థులకి చెప్పుకోదగ్గ ఓట్లే వచ్చాయి.. దీంతో ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని భావించిన ఈటెల రాజేందర్, అలాగే రఘునందన్ రావు గ్రౌండ్ వర్క్ రెడీ చేస్తున్నారట.. నియోజకవర్గ పరిధిలో ఉండే ముఖ్య నేతలకు రఘునందన్ రావు ఫోన్ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. మరోపక్క ఈటెల రాజేంద్ర సైతం తొలుతా కరీంనగర్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని భావించిన ఆయన.. అక్కడ బండి సంజయ్ ఉండడంతో.. యూటర్న్ తీసుకొని మెదక్ వైపు చూస్తున్నారట.. వీరిద్దరూ ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉండగా టికెట్ ఎవరికీ వస్తుందా అనే చర్చ పార్టీలో హాట్ హాట్ గా నడుస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news