నాకు శాలువలు, బోకేలు వద్దు : మంత్రి కోమటిరెడ్డి

-

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనకు కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు శాలువలు, బోకేలు తీసుకురావాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. వాటికి అయ్యే ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని కోరారు. దీంతో నిరుపేదలకు ఉపయోగం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయి లీడర్లు తమను కలవడమే సంతోషమన్నారు. ఎలాంటి గ్లింప్స్ తదితర హంగు ఆర్భాటాలకు వెళ్లాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. 

కాంగ్రెస్ పాలనలో ప్రజలు లీడర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదన్నారు. ప్రజా పాలన ద్వారా ఇతర కార్యక్రమాల ద్వారా తామే మీ ఇంటి ముందుకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట దోచుకొని ప్రభుత్వ ఖజనాను ఖాళీ చేసిందని గుర్తు చేశారు. దీంతో డబ్బులు వృధా చేయకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తే నిరుపేదల ఆరోగ్య రక్షణకు ఉపయోగపడుతుందని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news